Skip to main content

Namaste NRI

ఆకట్టుకుంటున్న స్లమ్ డాగ్ హస్బెండ్  ట్రైలర్

సంజయ్‌ రావు హీరోగా నటిస్తున్న చిత్రం స్లమ్‌ డాగ్‌ హస్బెండ్‌. ఏఆర్‌ శ్రీధర్‌ దర్శకుడు. అప్పిరెడ్డి, వెంకట్‌ అన్నపరెడ్డి నిర్మాతలు. సంజయ్ రావు సరసన ప్రణవి మానుకొండ హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో కళ్యాణ్‌రామ్‌ విడుదల చేశారు. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.దర్శకుడు మాట్లాడుతూ స్లమ్‌ ఏరియాలో ఉండే ఒక అమ్మాయి, అబ్బాయి పెళ్లి కోసం పడే తాపత్రయం, తనకున్న గండం నుంచి గట్టెక్కడానికి తొలుత కుక్కని పెళ్లి చేసుకున్న అబ్బాయి ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్న వైవిధ్యమైన కామెడీ సినిమా ఇది.ప్రేక్షకులకు వందశాతం వినోదాన్ని పంచే చిత్రమిది  అన్నారు. ప్రణవి మానుకొండ, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events