అమరావతి ఉద్యమం ప్రారంభమై 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా రాజధాని ప్రాంత రైతులకు సంఫీుభావంగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ప్రవాసాంధ్రులు ప్రదర్శన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించి అభివృద్ధి చేయాలని ప్రవాసాంధ్రులు కోరారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ మాస్టర్‌ప్లాన్‌కు విరుద్ధంగా సీఆర్‌డీఏ చట్టాన్ని మార్చేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. టీడీపీ అమెరికా విభాగం కో ఆర్డినేటర్ జయరాం కోమటి మాట్లాడుతూ అమరావతి రాజధాని మాత్రమే కాదని, సంపద సృష్టించే నగరమని తెలిపారు. ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోగా మళ్లీ మూడు రాజధానులంటూ కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, భాను మాగులూరి, మన్నవ వెంకటేశ్వరరావు, యడ్ల హేమప్రసాద్, సాయి బొల్లినేని, రామకృష్ణ ఇంటూరి, ఈశ్వర్ కక్కెర, తదిరులు పాల్గొన్నారు.