అగ్రరాజ్యం అమెరికాను వరుస సాంకేతిక సమస్యలు కలవరపెడుతున్నాయి. మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం, విమానయాన రంగంలో ఏటీసీ నెట్‌వర్క్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తిన కొద్దిరోజులకే తాజాగా ప్రముఖ బ్యాంకుల వ్యవస్థలు కూడా మొండికేశాయి. సాంకేతిక సమస్యల కారణంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవల్లో కస్టమర్లకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.

ముఖ్యంగా జేపీ మోర్గాన్ చేజ్ వ్యవస్థలో తలెత్తిన సాఫ్ట్‌వేర్ బగ్ కారణంగా వేలాది మంది ఖాతాదారులు తమ ఖాతాలను యాక్సెస్ చేయలేక, నగదు లావాదేవీలు పూర్తి చేయలేక ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రభావం ఇతర బ్యాంకులతో జరిగే లావాదేవీలపైనా పడటంతో బ్యాంక్ ఆఫ్ అమెరికా, వెల్స్ ఫార్గో, యూఎస్ బ్యాంక్, ట్రూయిస్ట్ ఖాతాదారులపై కూడా పడింది.















