ఈ కామర్స్ సరఫరాలపై తటస్థీకరణ పన్ను లేదా డిజిటల్ ట్యాక్స్ అమలు విషయమై భారత్, అమెరికా తాత్కాలిక విధానానికి అంగీకారం తెలిపాయి. అంతర్జాతీయ పన్ను సంస్కరణలకు 136 దేశాల ఈ ఏడాది అక్టోబర్ 8న అంగీకారం తెలియజేశాయి. దీంతో బహుళజాతి కంపెనీలు తాము కార్యాకలాపాలు నిర్వహించే దేశాల్లో 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని అమలు చేయాలంటే ఆయా దేశాలు డిజిటల్ ట్యాక్స్ తరహా పన్నులను రద్దు చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులోనూ ఈ తరహా పన్నులను తీసుకురాకూడదు. ఇందుకు పిల్లర్ `1, పిల్లర్ 2 పేరుతో రెండంచెల విధానాన్ని రూపొందించారు. ఈ కామర్స్ సరఫరాలపై భారత్ 2020 ఏప్రిల్ 1 నుంచి 2 శాతం పన్ను విధించనుంది. అమెరికా కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తుంది. పిల్లర్ 1 ను అమలు చేసే వరకు లేదా, 2024 మార్చి 31 వరకు ఏది ముందు అయితే అది అమల్లో ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)