తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఎన్నారై టీడీపీ విభాగం ఆందోళనకు దిగింది. గల్ఫ్ దేశాలైన కువైట్, ఖతార్, ఓమన్, దుబాయి, సౌదీ, బహరైన్‌లోని ఎన్నారై టీడీపీ నేతలు, కార్యకర్తలు, నారా, నందమూరి అభిమానులు నిరాహార దీక్షలకు దిగారు. సరైన కారణం లేకుండా అర్థరాత్రి చంద్రబాబును అరెస్టు చేయడం వైసీపీ ప్రభుత్వ పతనానికి నిదర్శనమని మండిపడ్డారు.
