Namaste NRI

 డాక్టర్‌ సుందరనాయుడు సేవలకు గుర్తింపుగా … తానా సేవా  పురస్కారం

పౌల్ట్రీ పరిశ్రమ పితామహులు, బాలాజీ హేచరీస్‌ అధినేత దివంగత డాక్టర్‌ వి.సుందరనాయుడు పౌల్ట్రీ రంగానికి అందించిన విశేష సేవలు, చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఆయన  తరపున నెక్‌ రమేష్‌బాబును ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రముఖులు సత్కరించారు. తానా ఆధ్వర్యంలో చిత్తూరు  జిల్లాలోని బంగారు పాళ్యం, చిత్తూరులో  వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో జరిగిన తానా కళోత్సవంలో సేవాస్రష్టలైన ఎనిమిది మంది ప్రముఖుల్ని సత్కరించారు. విద్యార్థులకు  ఉపకార వేతనాలు, సైకిళ్లు, రైతులకు వ్యవసాయ పరికరాలు, మహిళలకు కుట్టుమిషన్లను అందించారు. 11 మంది ఆదర్శ రైతుల్ని సత్కరించారు.

Social Share Spread Message

Latest News