
ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేసేందుకు అమెరికా ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్ చేపట్టడాన్ని అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. న్యూయార్క్, బోస్టన్, వాషింగ్టన్ డీసీ సహా అమెరికాలోని ప్రధాన నగరాల్లో పెద్ద ఎత్తున యుద్ధ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తాయి. ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఇరాన్‌పై అమెరికా యుద్ధానికి దిగవద్దని, హ్యాండ్సాఫ్ ఇరాన్ అంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. బోస్టన్, షికాగో, వైట్‌హౌజ్ ముందు, న్యూయార్క్ టైమ్స్ స్కేర్ వద్ద ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇజ్రాయెల్-ఇరాన్ సంక్షోభంలో కలుగజేసుకోవద్దని డొనాల్డ్ ట్రంప్ సర్కార్‌ను నిరసనకారులు డిమాండ్ చేశారు. ఇరాన్‌తో వివాదానికి, గాజాపై సైనిక చర్యకు ఇజ్రాయెల్ కారణమని, అమెరికా వెనక్కి తగ్గాలని నిరసనకారులు ట్రంప్ సర్కార్‌ను కోరారు.
