Namaste NRI

అలా చేస్తే ఉక్రెయిన్‌దే విజయం

అంతర్జాతీయ సమాజం నుంచి సహకారం ఇలాగే కొనసాగితే రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్‌ విజయం సాధించడం తథ్యమని బ్రిటన్‌ రక్షణ మంత్రి బెన్‌ వాలెస్‌ అన్నారు. తాము అందజేసే హైటెక్‌ రాకెట్‌ సిస్టమ్స్‌తో ఉక్రెయిన్‌ సైనిక సామర్థ్యం బలోపేతం అవుతుందని అన్నారు. ఎం270 మల్టిపుల్‌ లాంచ్‌ రాకెట్‌ సిస్టమ్‌ను ఉక్రెయిన్‌కు ఇవ్వనున్నట్లు బ్రిటన్‌ చెప్పింది. ఆ సిస్టమ్‌ను ఎలా వాడాలో ఉక్రెయిన్‌ సైనికులకు నేర్పనున్నట్లు కూడా ఆ  దేశం వెల్లడిరచింది. రష్యా ఆక్రమణను  ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌ దళాలకు శిక్షణ తప్పదని తెలిపారు. రష్యా తన వ్యూహాల్ని ఎప్పటికప్పుడు మార్చేస్తుందని, దానికి తగినట్లే ఉక్రెయిన్‌కు ఇవ్వాల్సిన మద్దతు విషయంలో తాము కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రష్యా దాడులను తిప్పి కొట్టేందుకు తాము అందజేసే ఆయుధాలు తోడ్పడతాయని ఆశాభావం వ్యక్తం  చేశారు. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events