అనంతపురం బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషన్ ఫ్యాక్ట్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం అంతేలే కథ అంతేతలే. తనీష్, వికాస్ వశిష్ట, సహర్ కృష్ణన్, శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రిధిమా క్రియేషన్స్ పతాకంపై దర్శకుడు శ్రీ ఎం నివాస్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలోని ఓ మారుమూల గ్రామంలో జరిగే కథ ఇది. భావోద్వేగాలకి పెద్ద పీట వేస్తూ తెరకెక్కిస్తున్నామన్నారు. హీరో తనీష్ మాట్లాడుతూ మావన సంబంధాల నేపథ్యంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులోని భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. అరుదుగా వచ్చే చిత్రమిది అన్నారు. అనంతపురం, నల్గొండ, హైదరాబాద్‌లో మూడు షెడ్యూల్స్‌లో చిత్రీకరణ జరుపుతాం అని దర్శకుడు తెలిపారు. సినిమా పేరులోనే కథ ఉంది. అందరికీ మంచి పేరు తీసుకొచ్చే చిత్రం అవుతుంది అన్నారు వికాస్ వశిష్ట. ఈ కార్యక్రమంలో ఇతర చిత్ర బృందం పాల్గొంది.