Namaste NRI

మెడికల్ మాఫియా నేపథ్యంలో… బలమెవ్వడు

ధృవన్‌ కటకం, నియా త్రిపాఠీ జంటగా నటిస్తున్న సినిమా బలమెవ్వడు. పృథ్వీరాజ్‌, సుహాసినీ, నాజర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సనాతన దృశ్యాలు పతాకంపై ఆరీబీ మార్కండేయులు నిర్మిస్తున్నారు. సత్య రాచకొండ దర్శకుడు. మెడికల్‌ మాఫియా నేపథ్యంతో ఈ సినిమా రూపొందుతున్నది. తాజాగా చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ కొన్ని నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. మెడికల్‌ మాఫియా సామాన్య ప్రజల్ని ఎలా ఇబ్బందులు పెడుతన్నదో చూపిస్తున్నాం. ఈ సమస్యను ఎలా ఎదుర్కొవాలి అనే అంశాన్నీ చెబుతున్నాం. మణిశర్మ సంగీతం ఆకర్షణగా నిలుస్తుంది అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సంతోష్‌, గిరి, సంగీతం: మణిశర్మ. ద. అక్టోబర్‌ 1న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events