రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ జంటగా నటిస్తున్న చిత్రం కృష్ణగాడు అంటే ఓ రేంజ్. రాజేష్ దొండపాటి దర్శకుడు. పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ,పీఎస్‌కే శ్రీలత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ వాస్తవానికి దగ్గరగా వుండే కథతో రాబోతున్న ఈ చిత్రంలో వినోదం, రొమాన్స్, యాక్షన్ అన్ని అంశాలున్నాయి. పల్లెటూరి నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో యూత్‌ను ఆకట్టుకునే అంశాలు కూడా వున్నాయి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాబు వర్గీస్.
