హన్సిక ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న చిత్రం మై నేమ్ ఈజ్ శృతి. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో బురుగు రమ్యా ప్రభాకర్ నిర్మించారు. ఈ చిత్రంలోని రెప్పే వేసేలోగా మారిందేమో నా రాత తప్పే చేసేలాగా ముప్పే వచ్చే నా వెంట అంటూ సాగే టైటిల్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. కృష్ణకాంత్ (కెకె) సాహిత్యం అందించిన ఈ పాటను హారిక నారాయణ ఆలపించారు. మార్క్ రాబిన్ సంగీతం అందించారు.ఈ సందర్భంగా హన్సిక మాట్లాడుతూ మై నేమ్ ఈజ్ శృతి లాంటి ఇంటెన్స్ స్టోరీని నేనెప్పుడూ చేయలేదు. సినిమాలోని ట్విస్ట్‌లు ఆశ్చర్యపరుస్తాయి అన్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు రమ్యా ప్రభాకర్. మనిషి చర్మం వొలిచి వ్యాపారంచేసే గ్యాంగ్‌తో ఓ యువతి పోరాటమే ఈ చిత్రం అని శ్రీనివాస్ ఓంకార్ అన్నారు. మురళీశర్మ, పూజా రామచంద్రన్, కేదార్‌శంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : కిషోర్ బోయిడవు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)