భారత్, చైనా మధ్య జరుగుతున్న సరిహద్దుల ఘర్షణ విషయంలో తాము తలదూర్చమని రష్యా తేల్చి చెప్పింది. భారత్‌లో కొత్తగా రష్యా రాయబారిగా డేనిస్ అలిపోవ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్, చైనా దేశాలు తాము మధ్యవర్తిత్వం వహించాలని భావిస్తే మాత్రం ఆ విషయాన్ని తాము కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. భారత్, చైనా మధ్య నడుస్తున్న సరిహద్దు ఘర్షణల్లో మేం తలదూర్చం అన్నారు. మధ్యవర్తిత్వం వహించే ఆలోచన కూడా మాకు లేదన్నారు. అయితే ఇరు దేశాలు తమ మధ్యవర్తిత్వాన్ని కోరుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి, ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామన్నారు. సరిహద్దు వివాదం పూర్తిగా వారి ద్వైపాక్షికం అంశం అని అన్నారు.