Namaste NRI

గ్లోబల్ స్టూడెంట్ రేసులో… ప్రవాస విద్యార్థిని

గ్లోబల్‌ స్టూడెంట్‌ రేసులో ప్రవాస విద్యార్థిని విజేతగా నిలిచారు. భారతీయ విద్యార్థిని, మానసిక ఆరోగ్య ప్రచారకర్త అయిన అనఘా రాజేశ్‌ చెగ్‌.ఆర్గనైజేషన్‌ గ్లోబల్‌ స్టూడెంట్‌ ప్రైజ్‌` 2022 కోసం ఎంపిక చేసిన తొలి పదిమంది జాబితాలో స్థానం సంపాదించారు. ఈ అవార్డు విజేతకు రూ.79.6 లక్షలు (లక్ష అమెరికన్‌ డాలర్లు) అందజేశారు.  పోషకాహారం, మానసిక ఆరోగ్యానికి సంబంధించి పరిశోధకురాలిగా, కథకురాలిగా, సామాజిక కార్యకర్తగా పలు ప్రాజెక్టులో పని చేసిన అనుభవం ఈమెకు ఉంది. యువత నిర్వహించే యువర్స్‌ మైండ్‌పుల్లీ అనే లాభాపేక్ష లేని సంస్థ వ్యవస్థాపకురాలు, సీఈవో అయిన అనుఘా రాజేశ్‌ మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.  40 మంది సభ్యులతో కూడిన బృందంతో కలిసి భారత్‌, యూఏఈ, ఆఫ్రికా, యూకేల్లో ఈమె సేవలు  అందిస్తున్నారు.  ప్రపంచవ్యాప్తంగా అసాధారణ విద్యార్థులను గుర్తించి గతేడాది నుంచి అవార్డులు అందజేస్తున్నారు.  150 దేశాల నుంచి 7 వేల దరఖాస్తులు రాగా, వాటిలో గోవాలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ విద్యార్థిని అనుఘా రాజేశ్‌ తుదిపోరులో నిలిచారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events