ఎస్ఎమ్ ఫోర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నూతన తారలతో వైవిధ్యమైన జానర్లో ఎమ్ఎస్వి సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం కాలం రాసిన కథలు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్, ఫస్ట్ సింగిల్‌ను తాజాగా హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ కాలం రాసిన కథలు టైటిల్ చాలా బాగుంది. అలాగే సాగర్ రాసిన డబ్బు విలువ తెలియజేసే సాంగ్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా మంచి విజయం సాధించి సాగర్‌కి, చిత్రంలో నటినటీలు అలాగే పని చేసిన టెక్నిషియన్లకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో అభిలాష్ గోగుబోయిన, హీరో అనిల్ కుమార్, సంగీత దర్శకుడు అరమాన్ మాట్లాడారు. దర్శక, నిర్మాత మాట్లాడుతూ కళ కోసం కలగని ఇష్టంతో కష్టపడుతున్న మా చిత్ర యూనిట్‌కు కృతజ్ఞతలు అని అన్నారు. ప్రస్తుతం రాజమండ్రి, పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోందన్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు.