Namaste NRI

పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో..యమధీర:శంకర్‌

కన్నడ నటుడు కోమల్‌ కుమార్‌ హీరోగా, క్రికెటర్‌ శ్రీశాంత్‌ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న చిత్రం యమధీర. శంకర్‌ ఆర్‌ దర్శకత్వం. ఈ చిత్రాన్ని వేదాల శ్రీనివాస రావు నిర్మించారు. నాగబాబు, ఆలీ, సత్యప్రకాశ్‌, మధుసూధన్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ సెక్రటరీ ప్రసన్నకుమార్‌, నిర్మాతలు రామ సత్యనారాయణ, డి.ఎస్‌.రావు ఆవిష్కరించారు.  ఎలక్షన్స్‌ నేపథ్యంలో మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించామని, ఈవీఎం మెషీన్‌ల ట్యాంపరింగ్‌ అనే అంశాన్ని చర్చించామని దర్శకుడు తెలిపారు. కన్నడంలో వంద సినిమాల్లో నటించిన కోమల్‌ కుమార్‌ ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ పాత్రను పోషించారని నిర్మాత పేర్కొన్నారు. ఈ నెల 23న విడుదలకానుంది. ఈ చిత్రానికి కెమెరా: రోష్‌ మోహన్‌ కార్తీక్‌, సంగీతం: వరుణ్‌ ఉన్ని, కథ, దర్శకత్వం: శంకర్‌ ఆర్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events