రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ సేనలు తమ భూభాగాన్ని తిరిగి పొందేందుకు శత్రు దేశాన్ని చావుదెబ్బ కొడుతూ ముందుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే రష్యాతో సరిహద్దు ప్రాంతమైన ఆగ్నేయ ఖార్కివ్‌ను ఉక్రెయిన్ దాదాపు తిరిగి తమ హస్తగతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓస్కిల్ నది, స్వాతోనే మధ్య రష్యా సేనలు ఏర్పాటు చేసిన రక్షణ వలయాన్ని ఉక్రెయిన్ దళాలు నిర్వీర్యం చేశాయి. ఆ ప్రాంతాన్ని దాటి ముందుకెళ్లాయి. దాదాపు తమ భూభాగంలో మెజారిటీ భాగాన్ని తిరిగి పొందాయి. ఉక్రెయిన్ సైన్యం ఇచ్చిన ఊహించని షాక్‌తో రష్యా సేనలు వెనక్కి తగ్గినట్లు బ్రిటన్ రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. గత్కంతరం లేక ఆ ప్రాంతానికి దూరంలో మరో రక్షణవలయాన్ని రష్యా సైన్యం చేర్పాటు చేసుకున్నట్లు తెలిపాయి. ఒకవేళ దాన్ని కూడా ఉక్రెయిన్ దళాలు తిరిగి ఆక్రమించుకోగలిగితే యుద్ధంలో రష్యాకు పెద్ద ఎదురుదెబ్బే అని తెలిపింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)