ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులైన 50 మంది నటుల జాబితాలో ఇండియా నుంచి ఒకే ఒక్క నటుడు, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు చోటు దక్కడం విశేషం. బ్రిటన్‌కు చెందిన ఎంపైర్ మ్యాగజైన్ 50 గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆల్‌టైమ్ పేరుతో విడుదల చేసిన జాబితాలో హాలీవుడ్ ప్రముఖ నటులు డెంజల్ వాషింగ్టన్, టామ్ హాంక్స్, ఆంథోనీ మార్లన్ బ్రాండో వంటి దిగ్గజాలకు చోటు దక్కింది. ఈ జాబితాలో భారత్ నుంచి చోటు దక్కిన ఏకైక నటుడు షారుక్ కావడం విశేషం.