Skip to main content

Namaste NRI

ఐస్‌లాండ్‌లో మూడు నెలల్లో.. ఇది నాలుగోసారి

ఐస్‌లాండ్‌లో మరో భారీ అగ్నిపర్వతం బద్దలైంది. ఇక్కడ అగ్నిపర్వాతాలు బద్దలవడం గడిచిన మూడు నెలల్లో ఇది నాలుగోసారి. అగ్నిపర్వతం నుంచి దట్టమైన లావా మంటలు చిమ్ముతూ ఉబికి వస్తోంది. పెద్ద ఎత్తున పొగలు ఎగిసిపడుతున్నాయి. లావాతోపాటు, లావా వేడికి కరిగిపోయిన రాతి ద్రవం కూడా పర్వతానికి ఇరువైపులా వరదలా పారుతున్నాయి.  ఐఎస్‌లాండ్‌ రాజధాని రెగ్జావిక్‌ ప్రాంతం లో ఉన్న ఈ అగ్నిపర్వతం బద్దలవుతుందని అధికారులు కొన్నిరోజుల ముందే హెచ్చరించారు. అంతేగాక స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. రెగ్జావిక్‌లో పోలీసులు అత్యవసరస్థితి ప్రకటించారు. ఐస్‌లాండ్‌లో 30 దాకా యాక్టివ్‌ అగ్నిపర్వతాలున్నాయి. అందుకే ఇక్కడికి అగ్నిపర్వాతాలను చూసేందుకు పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు.

Social Share Spread Message

Latest News