టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో స్వాతంత్య్ర దినోత్స వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కే కేశవరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హక్కుల కోసం, స్వేచ్ఛకోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల ఫలితమే నేటి స్వాతంత్య్ర వేడుకలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్సీలు, హుజూరాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.