Namaste NRI

అమెరికా తరువాత ఇండియా … రికార్డు స్థాయిలో!

ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి ఆందోళనకరంగా మారింది. రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. వ్యాక్సినేషన్‌ తరువాత  పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని భావించిన వారికి నిరాశే మిగిలింది. డెల్టా వేరియంట్‌ కంటే ఎన్నో రెట్లు అధికంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా వెలుగులోకొచ్చిన తరువాత తొలిసారి ఒకే రోజు భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

                అమెరికాలో ప్రతి రోజు భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లో అమెరికాలో 2,29,016 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. 823 మంది చనిపోయారు. ఇప్పటి వరకు అమెరికాలో కరోనా బారినపడిన వారి సంఖ్య 5,37,91,852కు చేరుకుంది. 8,39,605 మంది చనిపోయారు. 1,03,190 మంది గడిచిన 24 గంటల్లో డిశ్చార్జి అయ్యారు. 16,463 మంది ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇప్పటి వరకు 4,12,03,698 మంది కరోనాను జయించారు. అమెరికా తరువాత స్థానంలో ఇండియా ఉంది. ఇప్పటి వరకు 3,47,99,691 మంది కరోనా బారినపడ్డారు. 4,90,290 మంది చనిపోయారు. 3,42,43,945 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఆ తరువాత స్థానాల్లో బ్రెజిల్‌ ఉంది. ఇక్కడ 2.22 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. 6.18 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత స్థానంలో యూకే, రష్యా, టర్కీ, ఫ్రాన్స్‌ ఉన్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events