ఉగ్రవాద నిర్మూలనకు ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్, అమెరికా చేస్తోన్న ప్రయత్నాలకు చైనా మరోసారి మెకాలడ్డింది. లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది, 2008 ముంబయి పేలుళ్ల ఉగ్రవాది సాజిద్ మీర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చేందుకు భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనను డ్రాగన్ అడ్డుకుంది. ఉగ్రవాదంపై తన ద్వంద్వ వైఖరిని మరోసారి ప్రదర్శించింది. సాజిద్ మీర్ పేరును అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చడంతో పాటు అతడి ఆస్తులను స్తంభింపజేయడం, అతడి ప్రయాణాలపై నిషేధం వంటి ఆంక్షలు విధించాలని అమెరికా, భారత్ ప్రతిపాదించాయి. దీనికి ఐరాస భద్రతా మండలిలోని ఇతర దేశాలు ఆమోదం తెలపగా, ఒక్క చైనా మాత్రం దీన్ని హోల్డ్‌లో పెట్టి అడ్డుకుంది. దీంతో సాజిద్ మీర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. పాకిస్థాన్ ఉగ్రవాదులపై నిషేధం తీసుకొచ్చేలా అమెరికా, భారత్ చేస్తోన్న ప్రయత్నాలకు చైనా అడ్డుపుల్ల వేయడం నాలుగు నెలల్లో ఇది మూడోసారి కావడం గమనార్హం.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)