Namaste NRI

మరో 54 చైనా యాప్ లపై భారత్ నిషేధం

దేశ భద్రతకు సమస్య ఉన్న నేపథ్యంలో 54 చైనా యాప్‌లను నిషేధించాని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర హోం శాఖ సిఫార్సు మేరకు ఐటీ అండ్‌ ఎలక్ట్రానిక్‌ శాఖ మధ్యంతర ఉత్తరులిచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ యాప్స్‌ యూజర్ల తాలూకు వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేస్తున్నాయి.   నిషేధిత జాబితాలో స్వీట్‌ సెల్ఫీ హెడ్‌, బ్యూటీ కెమెరా` సెల్ఫీ కెమెరా, వివా వీడియో ఎడిటర్‌, టెన్‌సెంటర్‌ జీవర్‌, ఒన్‌మోజీ ఎరినా, యాప్‌ లాక్‌, డ్యుయల్‌ స్పేస్‌ లైట్‌ యాప్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది జూన్‌లో చైనాకు చెందిన 59 మొబైల్‌ అప్లికేషన్లను బ్యాన్‌ చేసిన విషయం తెలిసిందే. వాటిల్లో పాపులర్‌ యాప్‌లైన టిక్‌, వీచాట్‌, హలో కూడా ఉన్నాయి. జాతీయ భద్రతకు, సార్వభౌమాధికారినికి ముప్పు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 2020 మేలో చైనాతో సరిహద్దు ఘర్షణ మొదలైన తర్వాత ఇప్పటి వరకు 300 యాప్‌లను నిషేధించారు. గాల్వాన్‌ ఘర్షణ తర్వాత ఆ ఏడాది జూన్‌లో తొలిసారి చైనీస్‌ యాప్‌లను బ్యాన్‌ చేశారు. అయితే ఈ వ్యవహారంపై డ్రాగన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ వాటిని పునరుద్ధరించే యోచన తమకు లేదని భారత్‌ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events