శ్రీలంకకు ఇండియా పూర్తిగా మద్దతు ఇస్తుంది. ఆర్థిక సంక్షోభం వల్ల శ్రీలంకలో దారుణమైన పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ దేశానికి బలగాలను పంపిస్తున్నట్లు వస్తున్న వార్తలపై భారత్ స్పందించింది. ఆ దేశ ప్రజాస్వామ్యానికి, స్థిరత్వానికి, ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వనున్నట్లు కొలంబోలోని భాతర హై కమిషన్ వెల్లడిరచింది. మాజీ ప్రధాని మహింద రాజపక్స, ఆయన కుటుంబ సభ్యులు ఇండియాకు పారిపోయినట్లు వస్తున్న ప్రచారాన్ని కూడా ఇండియన్ మై కమిషన్ కొట్టిపారేసింది. రాజీనామా చేసిన తర్వాత రాజపక్స ఎక్కడికి వెళ్లారో ఇంకా తెలియదు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/telusukada-300x160.jpg)