Namaste NRI

సౌదీ యువరాజుకు భారత్‌ ఆహ్వానం

ఈ నెల 23న సౌదీ అరేబియా జాతీయ దినోత్సవం జరగనున్నందున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌కు అభినందనలు తెలిపారు. సాధ్యమైనంత త్వరలో భారత్‌ను సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు.  సౌదీ అరేబియాకు మొదటిసారి అధికార పర్యటన జరిపిన భారత విదేశాంగమంత్రి ఎస్‌.జైశంకర్‌ భారత ప్రధాని సందేశాన్ని యువరాజు బిన్‌ సల్మాన్‌కు అందజేశారు. బిన్‌ సల్మాన్‌ 2019 ఫిబ్రవరిలో తొలిసారి భారత సందర్శనకు వచ్చారు. జైశంకర్‌ సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్‌ ఫైజల్‌ బిన్‌ ఫర్హాన్‌తో సమావేశమై ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై చర్చించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events