Namaste NRI

భారత్‌ మరో ముందడుగు.. ప్రపంచంలోనే మొదటిసారి

అంతరిక్ష రంగంలో భారత్‌ మరో ముందడుగు వేసింది. చెన్నైకు చెందిన స్టార్టప్‌ సంస్థ అగ్నికుల్‌ కాస్మోస్‌ అగ్నిబాణ్‌ రాకెట్‌ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ సబ్‌ ఆర్బిటల్‌ టెక్నాలజీ డెమాన్‌ స్ట్రేటర్‌లో ప్రపంచంలోనే మొదటిసారిగా 3డీ ప్రింటెడ్‌ సెమీ-క్రయోజెనిక్‌ ఇంజిన్‌ను వినియోగించారు. గురువారం ఉదయం 7.15 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ప్రైవేటు లాంచ్‌ప్యాడ్‌ నుంచి దీన్ని ప్రయోగించారు. ఈ రాకెట్‌ను ఆటోపైలట్‌ సాఫ్ట్‌వేర్‌తో పూర్తిగా తామే డిజైన్‌ చేశామని, ఇందులో ప్రపంచంలోనే మొదటిసారిగా సింగిల్‌ పీస్‌ 3డీ ప్రింటెడ్‌ ఇంజిన్‌ను వినియోగించామని ఈ సంస్థ ప్రకటించింది. సెమీ క్రయోజెనిక్‌ ఇంజిన్‌ వాడిన మొదటి భారతీయ రాకెట్‌ ఇదే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress