భారత్‌లో హెపటైటిస్ బీ, సీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 2022లో అత్యధిక హెపటైటిస్ (కాలేయ వాపు) కేసులు నమోదైన దేశాల జాబితాలో చైనా మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉన్నది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. వైరల్ హెపటైటిస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజూ 3,500 మంది చనిపోతున్నారని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. ఏటా 13 లక్షల మంది మృత్యువాతపడుతున్నారని పేర్కొన్నది. ఇందులో 83 శాతం హెపటై టిస్ బీ కారణంగా సంభవిస్తుండగా, 17 శాతం మరణాలకు హెపటైటిస్ సీ కారణమని వివరించింది.