కరోనా మహమ్మారి వలన లాటిన్ అమెరికాలో 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 4 కోట్ల 50 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడిరచారు. ఇందులో ఎక్కువగా బ్రెజిల్‌లో 6 లక్షల మంది మరణించారు. కరోనా మరణాల్లో అమెరికా తర్వాత బ్రెజిల్ రెండో స్థానంలో ఉన్నది. అమెరికాలో ఇప్పటి వరకు కరోనా వల్ల 7,32,476 మంది మృతిచెందారు. ఇక మెక్సికో, పెరూ, కొలంబియా, అర్జెంటీనా దేశాల్లో అత్యధిక మరణాలు సంభవించాయి. ప్రపంచ వ్యాప్తంగా 23,79,69,872 మంది కరోనా బారిన పడగా, 4,85,327 మంది మృతి చెందారు. ఇందులో అమెరికాలో అత్యధిక కేసులు నమోదవగా, భారత్ రెండో స్థానంలో ఉన్నది. బ్రెజిల్, బ్రిటన్, రష్యా , టర్కీ, ఫ్రాన్‌స తర్వాతి స్థానాల్లో నిలిచాయి.