భారత్లో మతపరమైన మైనారిటీ వర్గాలపై 2021 సాంతం దాడులు చోటుచేసుకున్నాయని అమెరికా విదేశాంగ శాఖ ఓ నివేదికలో పేర్కొంది. దీనిపై భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ స్పందించారు. భారత్లో తమ స్వేచ్ఛ కొరవడుతోందంటూ అమెరికా చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడొద్దంటూ ఆ దేశానికి చురకలంటించాడు. అంతరాత్జీయ సంబంధాల్లో అమెరికా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుండటం దురదృష్టకరమని పేర్కొన్నారు. నివేదికను పక్షపాత వైఖరితో రూపొందించారంటూ విమర్శించారు.