ఒలింపిక్ క్రీడల్లో 25 ఏండ్ల తర్వాత ఇండియా సంచలనం సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్ పురుషుల టెన్నిస్ సింగిల్స్ బరిలో నిలిచిన ఏకైక భారత ప్లేయర్ సుమిత్ నాగల్. తొలి రౌండ్‌తో తన సత్తా చాటాడు. ఉజెబికిస్తాన్‌కు చెందిన టెన్నిస్ ప్లేయర్ డెన్నిస్ ఇస్టోమిన్‌ను 6-4, 6-7, 6-4 తేడాతో ఓడిరచి రెండో రౌండ్‌కి దూసుకెళ్లాడు. విజయం సాధించేందుకు ఆయనకు 34 నిమిషాలు పట్టింది. పురుషుల సింగిల్స్‌లో విజయం సాధించిన భారత మూడో ఆటగాడు ఇతడే కావడం విశేషం. 1996లో రజత పతకాన్ని సాధించిన భారత టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్ తర్వాత ఒలింపిక్ సింగిల్స్ లో విజయాన్ని అందుకున్న మొదటి టెన్నిస్ ప్లేయర్‌గా నిలిచాడు సుమిత్ నాగల్. 25 ఏళ్ల తర్వాత తొలి రౌండ్‌లో విజయం సాధించడంతో ఒలింపిక్ పతకంపై ఆశలు మొదలయ్యాయి.