భారత్, చైనాల మధ్య స్థిరమైన, శాంతియుత సంబంధాలు ఈ ప్రాంతానికే కాదు, ప్రపంచానికీ కీలకమైన ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్న విషయం తెలిసిందే. మోదీ వ్యాఖ్యలపై చైనా స్పందిస్తూ స్థిరమైన, సత్సం బంధాలు ఇరుదేశాల ఉమ్మడి ప్రయోజనాలకు మేలు చేకూరుస్తాయని తెలిపింది. సరిహద్దు సమస్య అనేది రెండిరటి మధ్య ఉన్న పూర్తి సంబంధాలను ప్రతిబింబించదని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో నింగ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలను గుర్తించాం. ఇరుదేశాల మధ్య మంచి, స్థిరమైన సంబంధాలు. ఉమ్మ డి ప్రయోజనాలకు, ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా శాంతిస్థాపన, అభివృద్ధికి దోహదపడతాయి. సరి హద్దు వివాదాన్ని సరైన రీతిలో పరిష్కరించుకోవాలి. దౌత్య, సైనిక మార్గాల్లో ఇరుపక్షాలు ఇప్పటికే సంప్ర దింపులు జరుపుతున్నాయి. వ్యూహాత్మక, దీర్ఘకాలిక కోణంలో ద్వైపాక్షిక సంబంధాల నిర్వహణ, పరస్పర విశ్వాసం, సహకారం, సంప్రదింపులు, విభేదాల పరిష్కారం విషయంలో మాతో భారత్ కలిసివస్తుంందని అశిస్తున్నాం అని మావో నింగ్ తెలిపారు.