భారత ప్రభుత్వం సరేనంటే కొవిడ్ 19 వ్యాక్సిన్లను పెద్దఎత్తున పంపిస్తామని అమెరికా తెలిపింది. వ్యాక్సిన్లను విరాళంగా పొందడానికి చట్టపరమైన నిబంధనలను సమీక్షించాల్సి ఉన్నట్లు భారత్ చెబుతోందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ మీడియాకు తెలిపారు. భారత్ సహా ప్రపంచంలోని వివిద దేశాలకు 8 కోట్ల డోసుల వ్యాక్సిన్లు ఇచ్చేందుకు సిద్ధమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే ప్రకటించారు. పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ వంటి పలు దేశాలు 4 కోట్ల డోసుల్ని పొందాయి. అత్యవసర దిగుమతులకు చట్టపరమైన అడ్డంకుల కారణంగా భారతదేశం ఈ టీకాలను ఇంకా దిగుమతి చేసుకోలేకపోయింది