వన్డే ప్రపంచకప్‌లో భారత్ బోణీ కొట్టింది. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టును 199 పరుగులకే ఆలౌట్ చేశారు. పెద్దగా స్కోరు చేయకుండా బౌలర్లు కట్టుదిట్టం చేయగా, ఆ తర్వాత బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ విఫలమైనా, కోహ్లీ, రాహుల్ నిలబడి కుమ్మేశారు. 201 పరుగులతో వరల్డ్ కప్‌లో తొలి విజయంతో బోణీ కొట్టారు. ఇందులో కోహ్లీ (85), రోహిత్ (0), ఇశాన్ కిషన్ (0), శ్రేయస్ అయ్యర్ (0) పరుగులు చేయగా.. రాహుల్ 97, హార్దిక్ పాండ్యా 11 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఆస్ట్రేలియా విధించిన 200 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీం ఇండియాకు ప్రారంభంలోనే గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. సారధి రోహిత్ శర్మ సహా ఓపెనర్ ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ డకౌట్ కావడంతో మూడు వికెట్లు కోల్పోయి టీం ఇండియా పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ.. జట్టు పరిస్థితి చక్కదిద్దే బాధ్యత తలకెత్తుకున్నారు.