భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాల్లో మూడోపక్షం జోక్యాన్ని ఏ మాత్రం సహించమని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వూ కియాన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుడూ సరిహద్దు గొడవ భారత్, చైనా మధ్య జరుగుతున్న ఘర్షణ అని, మూడో పక్షం జోక్యాన్ని సహించమని పేర్కొన్నారు. ఇక భారత్ కూడా ఇదే వైఖరితో వుందని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలన్నీ కూడా అమెరికాను ఉద్దేశించి చేసినవే. బలవంతపు దౌత్యం అన్న శబ్దాన్ని అమెరికా ప్రయోగించడానికి మరీ తహతహలాడిపోతోందంటూ ఆయన ఎద్దేవా చేశారు. అందులో అమెరికా మాస్టర్ అని ఆయన విరుచుకుపడ్డారు. అమెరికా చేస్తోన్న ఈ బలవంతపు దౌత్యాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. సరిహద్దు సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు.














