అమెరికాలోని ఓ ప్రముఖ సంస్థకు భారతీయ అమెరికన్ మహిళ సీఈఓగా నియమితులయ్యారు. సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల్లో పేరొందిన హబ్‌స్పాట్‌కు సీఈఓగా భారతీయురాలు యామిని రంగన్ ఎన్నికయ్యారు. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన యామిని బ్రియాన్ హల్లిగాన్ స్థానంలో సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. బ్రియాన్ గత 15 ఏళ్లుగా ఈ పదవిలో కొనసాగారు. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉండనున్నారు. ఇక గతేడాది చీఫ్ కస్టమర్ ఆఫీసర్‌గా పదొన్నతి పొందిన యామిని ఈ ఏడాది సీఈవోగా నియామకం కావడం విశేషం. సెప్టెంబర్ 7న ఆమె అధికారికంగా ఈ బాధ్యతలు చేపట్టనున్నారు.
డ్రాప్‌బాక్స్ సంస్థలో పనిచేసి మానేసిన తర్వాత యామిని 2020 జనవరిలో హబ్‌స్పాట్ కంపెనీలో చేరారు. 2019లో ఆమె శాన్ ఫ్రాన్సిస్కో బిజినెస్ టైమ్స్ ద్వారా బిజినెస్‌లో అత్యంత ప్రభావవంతమైన మహిళలలో ఒకరిగా గుర్తింపు పొందారు.