Skip to main content

Namaste NRI

‘మిస్ జార్జియా టీన్ యూఎస్ఏ’ విజేతగా భారతీయ అమెరికన్ కిరణ్ రెడ్డి

అమెరికాలోని జార్జియాలో నివాసముంటున్న కిరణ్ రెడ్డి (18) ఇటీవల జరిగిన మిస్ జార్జియా టీన్ యూఎస్ఏ ( Miss Georgia Teen USA 2026) పోటీల్లో విజేతగా నిలిచి కిరీటం దక్కించుకున్నారు. ఈ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ అమెరికన్ గా చరిత్ర సృష్టించింది. ఆగస్టులో మియామిలో జరగనున్న మిస్ టీన్ యూఎస్ఏ పోటీలకు జార్జియా తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. జార్జియా లోని కాఫీ కౌంటీ కి చెందిన కిరణ్ రెడ్డి ఇటీవలే విద్యాభ్యాసం పూర్తిచేశారు. మూడేళ్ల క్రితం స్థానిక కౌంటీ లో అందాల పోటీల్లో పాల్గొనడంతో తన ప్రస్థానం మొదలైంది అని అనతి కాలంలోనే మిస్ జార్జియా టీన్ యూఎస్ఏ గా నిలిచానని చెప్పారు. భవిష్యత్తులో వైద్య వృత్తిలో స్థిరపడి తన తండ్రి లాగే సేవ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఆగస్టు లో జరిగే మిస్ టీన్ యూఎస్ఏ పోటీల్లో పాల్గొనే ఈమె దేశ వ్యాప్తంగా 50 మంది పోటీదారులను ఎదుర్కోవాల్సి వుంటుంది.

Social Share Spread Message

Latest News