అమెరికాలోని జార్జియాలో నివాసముంటున్న భారతీయ సంతతికి చెందిన కిరణ్ రెడ్డి (18) ఇటీవల జరిగిన జాతీయ స్థాయి అందాల పోటీల్లో సత్తా చాటారు.ఆగస్టులో ఫ్లోరిడాలోని మియామిలో జరిగిన మిస్ టీన్ యూఎస్ఏ( Miss Teen USA 2026) పోటీలలో ఉత్తమ ప్రతిభను కనబరచి టైటిల్ ని సొంతం చేసుకున్నారు. జూలై లో జరిగిన మిస్ జార్జియా టీన్ యూఎస్ఏ ( Miss Georgia Teen USA 2026) పోటీల్లో విజేతగా నిలిచి టైటిల్ దక్కించుకున్న ఆమె. దేశ వ్యాప్తంగా 50 రాష్ట్రాల నుండి వచ్చిన అందాల భామలను వెనక్కు నెట్టి అందాల పోటీల్లో జాతీయ స్థాయి పోటీల్లో టైటిల్ కైవసం చేసుకున్న భారత సంతతి యువతి గా రికార్డు సృష్టించింది.


జార్జియా లోని కాఫీ కౌంటీ కి చెందిన కిరణ్ రెడ్డి ఇటీవలే విద్యాభ్యాసం పూర్తిచేశారు. మూడేళ్ల క్రితం స్థానిక కౌంటీ లో అందాల పోటీల్లో పాల్గొనడంతో తన ప్రస్థానం మొదలైంది అని అనతి కాలంలోనే మిస్ జార్జియా టీన్ యూఎస్ఏ గా నిలిచి ఇప్పుడు మిస్ టీన్ యూఎస్ఏ టైటిల్ గెలుచుకుంది. అక్టోబర్ లో కంబోడియా లో జరిగే మిస్ టీన్ యూనివర్స్( Miss Teen Universe) పోటీల్లో అమెరికా తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు.


















