అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో విజయం సాధించారు. ఇల్లినాయిస్ లో 8 వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన డెమోక్రటిక్ పార్టీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రత్యర్థి మార్క్ రిక్ పై దాదాపు 30 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు.
2016లో తొలిసారి ఆయన అక్కడి నుంచి ప్రతినిధుల సభకు వెళ్లారు. సెలక్ట్ కమిటీ ఆన్ చైనీస్ కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడిగా పని చేశారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న కృష్ణమూర్తి ఇల్లినాయిస్‌లో పలు పదవులు నిర్వహించారు. స్టేట్ ట్రెజరర్‌గా కూడా ఆయన సేవలు అందించారు. మూడుసార్లు ఎంపీగా ఉన్న రాజా కృష్ణమూర్తి, అమెరికా సెనేట్‌లోని ఇంటెలిజెన్స్ సెలెక్ట్ కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు.