కువైత్‌లోని ప్రవాసులకు భారత ఎంబసీ కీలక సూచన చేసింది. ఈ నెల 31వ తేదీన కాన్సులర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. జాహ్రాలో నిర్వహించే ఈ క్యాంప్ ప్రత్యేకంగా కువైత్‌లోని భారత ప్రవాసులకు ఉపయోగకరంగా ఉంటుందని ఎంబసీ వెల్లడించింది. క్యాంప్ ద్వారా ప్రవాసులకు పాస్‌పోర్ట్ రెన్యువల్(ఆన్‌లైన్ ఫారమ్ ఫిల్లింగ్, ఫోటోగ్రాఫ్), రిలేషన్‌షిప్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, సిగ్నేచర్ అటెస్టేషన్, ఇతర ముఖ్యమైన సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయని ఎంబసీ అధికారులు వెల్లడించారు.
అంతేగాక ఈ క్యాంప్‌లోనే అదే రోజు కావాల్సిన ధృవపత్రాలను జారీ చేయడం జరుగుతుంది. కనుక ధృవపత్రాల కోసం మళ్లీ ఎంబసీకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక ఈ సర్వీసులు పొందేందుకు కేవలం క్యాష్ పేమెంట్లు మాత్రం స్వీకరించడం జరగుతుందని రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని భారత ప్రవాసులను ఎంబసీ కోరింది.
![](https://namastenri.net/wp-content/uploads/2023/03/f45ad641-4a72-48bc-b72d-4f37995c2771-44.jpg)