కువైత్‌లోని భారత రాయబార కార్యాలయం తాజాగా కీలక ప్రకటన చేసింది. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైనందున పాస్‌పోర్ట్ సెంటర్ పనివేళలు మార్చింది. ఈ నేపథ్యంలో ఇండియన్ పాస్‌పోర్ట్ అండ్ వీసా సర్వీస్ సెంటర్స్ ఆఫ్ బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ కొత్త వర్కింగ్ అవర్స్‌ను ప్రకటించింది. రంజాన్ మాసం మొత్తం బీఎల్ఎస్ సెంటర్స్ ఈ కొత్త గంటలలోనే పని చేయనున్నాయి. కొత్త పనివేళల ప్రకారం శనివారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు పని చేస్తాయి. కాగా, ప్రస్తుతం కువైత్ సిటీ, ఫహాహీల్, అబ్బాసియా ప్రాంతాల్లో బీఎల్ఎస్ కేంద్రాలు ఉన్నాయి. ఇక భారత రాయబార కార్యాలయం మాత్రం తన సాధారణ పని వేళలను నిర్వహిస్తుంది.