Namaste NRI

ఎప్‌స్టీన్‌ బాధితుల్లో భారతీయ బాలిక!

లైంగిక నేరగాడు ఎప్‌స్టీన్‌ బాధితుల్లో భారతీయ బాలిక కూడా ఉన్నట్టు తేలింది. తాజాగా బయటకొచ్చిన డాక్యుమెంట్స్‌లో ఈ విషయం వెల్లడైంది. ఈ ఫైల్స్‌ ప్రకారం.. బాధితురాలికి పరిహారం అందించేందుకు అమెరికా అధికారులు భారత్‌లో సదరు బాలిక ఆచూకీ కోసం ప్రయత్నాలు సాగించారు. ఇందుకు సంబంధించి 2020 జనవరి 13 నాటి అమెరికా అధికారుల ఈ మెయిల్‌ వెలుగులోకి వచ్చింది. భారత్‌లో బాలిక అడ్రస్‌ కోసం అందులో ఆరా తీశారు.

కాగా, ఇప్పటికే కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి పేరు ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో దర్శనమివ్వడంపై దుమారం చెలరేగగా, తాజాగా మరో బీజేపీ నేత పేరు కూడా ఈ ఫైల్స్‌లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. బిల్‌గేట్స్‌, ఎప్‌స్టీన్‌ మధ్య సాగిన ఈ మెయిల్‌ సంభాషణలో హర్షవర్ధన్‌ పేరు ప్రస్తావనకు వచ్చింది. 2014 జూన్‌ 5నాటి ఈ ఈ-మెయిల్‌లో, డాక్టర్‌ హర్షవర్ధన్‌ను మీరు కలిశారా? అని బిల్‌గేట్స్‌ను ఎప్‌స్టీన్‌ అడిగారు. అప్పుడు హర్షవర్ధన్‌ కేంద్ర మంత్రిగా ఉన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events