Namaste NRI

భారత హైకమిషన్ కీలక ప్రకటన… ఈ సర్వీస్ వెంటనే అందుబాటులోకి  

లండన్‌లోని భారత హైకమిషన్  కీలక ప్రకటన చేసింది. బ్రిటన్ ప్రయాణికుల కోసం ఎలక్ట్రానిక్ వీసాలను  పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవలి నెలల్లో ఇండియాకు వీసాల కోసం భారీ డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా యూకేలోని భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి మాట్లాడుతూ ఈ సర్వీస్ వెంటనే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈరోజు పెద్ద వార్త ఏమిటంటే, మేము మరోసారి ఇ-వీసాలను పునరుద్ధరిస్తున్నాము. ఇది యూకే నుండి ఇండియాకు చాలా సులభంగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. ఇక ఈ వారం నుంచి ప్రయాణికులు భారతదేశానికి ఇ-వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని లండన్‌లోని హైకమిషన్ అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం సిస్టమ్ అప్‌గ్రేడ్ ప్రక్రియ కొనసాగుతోందని, భారతీయ వీసా వెబ్‌సైట్ త్వరలో ఈ-వీసాల కోసం దరఖాస్తులను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress