అమెరికాలోని షికాగోలో భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఇండియన్ కమ్యూనిటీ ఔట్ రీచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ భారతీయ సంఘాలు, ప్రముఖ తెలుగు సంఘాలు తానా, షికాగో, ఆంధ్ర అసోసియేషన్ పాల్గొన్నాయి. భారతీయ సంఘాలకు ఇల్లినాయిస్ స్టేట్ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు మద్దతుగా నిలిచారు. ఈ వేడుకలను ఉద్దేశించి షికాగో ఇండియన్ కాన్సుల్ జనరల్ అమిత్‌కుమార్, ఐసీవో సీఈవో కృష్ణ బన్సాల్ మాట్లాడారు. బాలీవుడ్ సింగర్ గురు రంధావా లైవ్ కాన్సర్ట్‌కు భారీగా ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో ఎన్నారైలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో షికాగోకు చెందిన తానా నాయకుడు హేమ కానూరు, మిడ్ వెస్ట్ రీజినల్ ప్రెసిడెంట్ హను చెరుకూరి, తానా ప్రతినిధులు రవి కాకర, కృష్ణ మోహన్, చిరంజీవి గళ్ల తదితరులు పాల్గొన్నారు. తెలుగువారి ఖ్యాతిని, స్వాతంత్య్రం సాధించడంలో తెలుగు వాళ్ల చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించారు. కాంగ్రెస్ మ్యాన్ బిల్ ఫోస్టర్ తెలుగు వాళ్ళ భాగస్వామ్యానిష్ట్ర్న ప్రదర్శించిన తానా లీడర్షిప్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.














