Skip to main content

Namaste NRI

దుబాయ్‌లో జాక్‌పాట్ కొట్టిన భారతీయుడు

దుబాయ్‌లో స్థిరపడ్డ బాలీవుడ్‌ నిర్మాత రంజన్‌ లాల్‌కు 25 ఏండ్ల నిరీక్షణ తర్వాత కళ్లు చెదిరే, కలలో ఊహించని జాక్‌పాట్‌ తగిలింది. కొన్ని రోజుల క్రితమే 79వ పుట్టిన రోజు జరుపుకున్న ఆయనకు దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్‌ రాఫెల్‌ లాటరీలో రూ.8-9 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది.

క్యాన్సర్‌తో బాధ పడి, మూడు గుండె పోట్లు, ఒక హార్ట్‌ ఫెయిల్యూర్‌ను ఎదుర్కొన్న రంజన్‌ ఈ జాక్‌పాట్‌ను అత్యుత్తమ పుట్టిన రోజు బహుమతిగా అభివర్ణించారు. లాటరీ డబ్బుతో ఏం చేయాలనేది ఇంకా ఆలోచించలేదని ఆయన చెప్పారు. జీవితం ఎప్పుడూ సజావుగా సాగుతుందని, డబ్బు అవసరం ఉండదని ఎవరూ అనుకోకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. గత 25 ఏండ్లుగా ఏటా ఒక లాటరీ టికెట్‌ను తాను కొంటున్నట్టు తెలిపారు.

Social Share Spread Message

Latest News