అమెరికాలోని న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా భారత సంతతికి చెందిన వ్యక్తి ఎన్నికయ్యారు. డెమోక్రటిక్ అభ్యర్థిత్వానికి జరిగిన ఎన్నికల్లో భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమదాని విజయం సాధించారు. ఆయన మాజీ గవర్నర్ ఆండ్రూ క్యుమోపై గెలుపొందారు. ప్రైమరీ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థులెవరికీ స్పష్టమైన మెజారీటీ రాలేదు. దీంతో ర్యాంక్ చాయిస్డ్ కౌంట్ ద్వారా జోహ్రాన్ ఎన్నికైనట్టు ప్రకటించారు.

ఈ ఏడాది నవంబర్‌లో జరిగే న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో 33 ఏండ్ల జోహ్రాన్ ఎన్నికైతే తొలి ముస్లిం, భారత సంతతి మేయర్‌గా రికార్డులకెక్కుతారు. కాగా, మమదాని ప్రముఖ ఇండో అమెరికన్ చిత్ర దర్శకురాలు మీరానాయర్ కుమారుడు. సెక్స్ స్కాండల్‌లో ఇరుక్కున్న క్కుమో దాని నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నారు.
