
భారత సంతతికి చెందిన క్లీన్ వాటర్ స్టార్టప్ సీఈవో అనురాగ్ బాజ్‌పేయిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలో ఉన్నతస్థాయి వ్యభిచార గృహాలతో సంబంధాలు పెట్టుకున్నట్టు ఆయనపై కేసు దాఖలు చేసిన అధికారులు ఆరోపించారు. వ్యభిచార గృహాలలో గంటల లెక్కన లైంగిక సేవలు పొందడానికి నమోదైన ఖరీదైన వ్యక్తుల జాబితాలో బాజ్‌పేయి ఒకరని పేర్కొన్నారు. బాజ్‌పేయి, లాయర్లు, ఉన్నతాధికారులు, డాక్టర్లు, ప్రభుత్వ కాంట్రాక్టర్లతో ఉన్న ప్రత్యేక ఖాతాదారుల గ్రూప్‌నకు చెందిన వారని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఈయన మహిళలతో, ముఖ్యంగా అసియాకు చెందిన వారితో గడపడానికి గంటకు 600 డాలర్లు (సుమారు రూ.50 వేలు) చెల్లించేవారని, ఆ మహిళల్లో చాలామంది మానవ అక్రమ రవాణాకు గురైన వారని అధికారులు తెలిపారు.
