అమెరికాలో భారత సంతతి మున్సిపల్ కౌన్సిలర్ ఆనంద్ షాపై మాఫియా ఆరోపణలు వచ్చాయి. గ్యాంబ్లింగ్ ఆపరేషన్ నడిపిస్తున్నట్లు అతనిపై అభియోగాలు నమోదు అయ్యాయి. న్యూజెర్సీ అటార్నీ జనరల్ మాథ్యూ ప్లాట్కిన్ ఆ ఆరోపణలు చేశారు. మాఫియా తరహా గ్యాంబ్లింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు ఆనంద్ షా, రాకెటీరింగ్, గ్యాంబ్లింగ్, మనీ ల్యాండరింగ్ కు పాల్పడుతున్న తేలింది. అభియోగాలు నమోదు అయిన 39 మందిలో అతను ఉన్నట్లు అటార్నీ జనరల్ తెలిపారు. రాష్ట్రంలోని 12 ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించిన తర్వాత ఈ అభియోగాలు నమోదు చేశారు. మొత్తం 4 పోకర్ క్లబ్‌లపై దాడులు జరిగాయి.

న్యూజెర్సీలో ఆనంద్ షా ఓ కీలక రాజకీయవేత్తగా ఎదుగుతున్నారు. న్యూయార్క్ శివారు ప్రాంతం ప్రాస్పెక్ట్ పార్క్‌లో అతను మున్సిపల్ కౌన్సిలర్‌గా రెండో సారి చేస్తున్నాడు. ఫైనాన్స్, ఎకనామిక్ డెవలప్మెంట్, ఇన్సూరెన్స్ ఇంచార్జీగా ఉన్నాడతను. కౌన్సిల్ సభ్యుడిని అరెస్టు చేయడం అంటే ప్రజల్లో ఎన్నికైన వ్యక్తులపై విశ్వాసాన్ని కోల్పోవడమే అవుతుందని అటార్నీ తెలిపారు.
