Skip to main content

Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్ టీమ్‌ నుంచి తప్పుకోనున్న భారత సంతతి అధికారి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీనియర్ సలహాదారుగా పనిచేసిన భారత సంతతికి చెందిన శ్రీరామ్ కృష్ణన్ తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ నెలాఖరులో టెక్నాలజీ సలహాదారు పదవి నుంచి దిగిపోనున్నట్లు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో అమెరికా ఏఐ విధానాలను రూపొందించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ట్రంప్‌తో కలిసి పని చేయడం తనకు లభించిన గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఏఐ పోటీని తట్టుకొని దేశం ముందుకు వెళ్లడానికి అధ్యక్షుడు కీలక చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు.

ట్రంప్‌ నాయకత్వం లేకుండా అమెరికా ఏఐ రేసులో ముందంజలో ఉండేది కాదన్నారు. తాను అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు అమెరికా అభివృద్ధి కోసం పని చేశానని శ్రీరామ్ కృష్ణన్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సలహాదారుగా తాను అమెరికన్ ఏఐ యాక్షన్ ప్లాన్‌ను రూపొందించి, ప్రచురించడంలో సహాయపడ్డానని వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం నేషనల్ ఏఐ పాలసీ ఫ్రేమ్‌వర్క్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై పనిచేసినట్లు తెలిపారు. ఫ్రాన్స్, భారత్‌ వంటి దేశాలలో జరిగిన అంతర్జాతీయ ఫోరమ్‌లు, సదస్సులలో అమెరికన్ ఏఐ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించానని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News