Namaste NRI

భారతీయ ప్రయాణీకులు సరికొత్త రికార్డు

మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ద్వారా ఎక్కువగా రాకపోకలు జరిపిన ప్రయాణీకుల జాబితాలో భారతీయ ప్రయాణీకులు  అగ్రస్థానంలో నిలిచారు.  నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. డిసెంబర్ 2022 నాటికి 1.47లక్షల కంటే ఎక్కువ మంది భారతీయ ప్రయాణీకులు మస్కట్ విమానాశ్రయం ద్వారా ప్రయాణించడం జరిగింది. భారత్ తర్వాత స్థానాల్లో బంగ్లాదేశ్ (53,130), పాకిస్థాన్ (39,853) ఉన్నాయి.

2022 చివరి నాటికి ఏకంగా 65వేలకు పైగా ఇంటర్నేషనల్ విమాన సర్వీసులు నడిచాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి ఇది కేవలం 28,580గా మాత్రమే ఉంది. సుల్తానేట్ ఆఫ్ ఒమన్ ఎయిర్‌పోర్టుల  ద్వారా వచ్చేవారి సంఖ్య గణనీయంగా 133 శాతం మేర పెరిగింది. అలాగే డిపార్చర్ల సంఖ్య కూడా గత డిసెంబర్ చివరి వరకు 109 శాతం పెరిగింది. ఇక గతేడాది చివరినాటికి మస్కట్, సలాలా, సోహార్, దుక్మ్ విమానాశ్రయాల ద్వారా రాకపోకలు సాగించిన ప్రయాణీకుల మొత్తం సంఖ్య 9,876,762కి చేరింది. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు   ద్వారా ప్రయాణించిన అంతర్జాతీయ, దేశీయ విమానాల సంఖ్య  107శాత పెరిగింది. 68,737 విమాన సర్వీసుల ద్వారా 8,602,792 మంది ప్రయాణించారు. ఇక గతేడాది మస్కట్, సలాలా, సోహార్ ఎయిర్‌పోర్టుల  ద్వారా రాకపోకలు కొనసాగించిన అంతర్జాతీయ విమానాల సంఖ్య ఏకంగా 128శాతం పెరగడం గమనార్హం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events