కెనడా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత విద్యార్ధి మరణించాడు. హరియాణాకు చెందిన కార్తీక్ సైనీ గా 2021లో పై చదువుల కోసం కెనడాకు వెళ్లాడు. టొరంటోలో సైకిల్‌పై రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన పికప్ ట్రైన్ ఢీ కొట్టడంతో మరణించాడని పోలీసులు తెలిపారు. విద్యార్ధిని కాపాడేందుకు ఎమర్జెన్సీ సేవల బృందం తీవ్రంగా శ్రమించినా అతడి ప్రాణాలను కాపాడలేకపోయారు. యోంజీ స్ట్రీట్, సెయింట్ క్లేర్ అవెన్యూ ప్రాంతాల మధ్య ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. కార్తీక్ మృతి పట్ల దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీస్ అధికారి లారా బ్రెబంట్ వెల్లడించారు.
కార్తీక్ షెరిదాన్ కాలేజ్‌లో చదువుతుండగా, అతడి మృతి పట్ల కాలేజ్ నిర్వాహకులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కార్తీక్ మృతి పట్ల అతడి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, ప్రొఫెసర్లకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని పేర్కొన్నారు. కార్తీక్ మృతదేహాన్ని సత్వరమే భారత్‌కు పంపాలని, ఈ దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారని హర్యానాకు చెందిన మృతుడి సోదరుడు తెలిపారు.